నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీలకు మిగిలింది దోకాయేనా? - ప్రతిధ్వనిఅంశం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 10:12 PM IST
Prathidhwani: రాష్ట్రంలో జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు మిగిలింది దోకాయేనా? "నా మైనార్టీలూ అంటూనే, వారికి తీరని అన్యాయం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే అంటున్నాయి ముస్లిం హక్కుల పోరాట సంఘాలు. అన్నిరంగాల్లో అన్యాయం చేశారని, పథకాల నుంచి తమ ప్రయోజనాల పరిరక్షణ వరకు ప్రతిచోటా మొండిచెయ్యే చూపారని వారంతా వాపోతున్నారు. అసలు ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లిం వర్గాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? వైసీపీ ఏలుబడిలో ముస్లింలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు?
ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఒక ముస్లిం ఉన్నప్పుడు వారి కష్టాలు కానీ, బాధలు కానీ ఆయన వింటున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి డజన్ల కొద్దీ సలహాదారులు ఉన్నారు కదా. పేదరికంలో ఉన్న అత్యధిక ముస్లింల జీవన స్థితిగతులు మార్చే నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఏం తీసుకుంది? నాలుగున్నరేళ్లుగా ఏం అమలు చేసింది? మైనార్టీల సంక్షేమంలో కీలకమైన సబ్‌ప్లాన్ అమలు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల వినియోగం ఎలా ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.