PRATHIDHWANI: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో ఏం ఒరిగింది..? - ఆర్టీసీలో అక్రమాలపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
PRATHIDHWANI: రాష్ట్రంలో ప్రగతిరథ చక్రాల పయనమెటు? కొంతకాలంగా అందరిదీ ఇదే ప్రశ్న. కోట్లాదిమంది ప్రజలకు సేవలు అందిస్తున్న 50వేల మందికి పైగా ఉద్యోగులకు సంబంధించి అంశం కావడం వల్ల ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఏ ప్రయోజనాలైతే వస్తాయని చెప్పారో.. అవి ఎంత మేరకు నెరవేరాయి? విలీనానికి సంబంధించి పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఏమని హామీ ఇచ్చారు? ప్రస్తుతం ఉద్యోగులపై పనిభారం ఏ స్థాయిలో ఉంది? భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీలో నియామకాలు చేపడుతున్నారా? రాష్ట్రంలో అనేక కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ ఆర్టీసీ. కాల క్రమంలో వాటి విలువ వందలరెట్లు పెరుగుతూ రావాలి. ఈ లెక్కన చూస్తే ఆర్టీసీ ఎంతో సుసంపన్నంగా ఉండాలి కదా? ఇన్ని ఆస్తులు ఉంచుకుని కూడా ఆర్థిక ఇబ్బందులు దేనికి.. అవన్నీ ఈ నాలుగేళ్లలో అమలు చేశారా.. లేదా? ట్రేడ్ యూనియన్ల నుంచి అసోసియేషన్‌లుగా మారాలన్న ఒత్తిడి దేనికి? అసలు ఈ రెండు వ్యవస్థల మధ్య కార్మికుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలు ఏమిటి? ఆదాయాలు, ఆస్తులు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ పోకడలు ఆర్టీసీ భవితవ్యంపై ఏం సంకేతాలిస్తున్నాయి? ఆర్టీసీకి వచ్చే రోజువారీ ఆదాయాన్ని కొంత ప్రభుత్వం తీసుకోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సంస్థ అవసరాలు, ప్రయోజనాల రీత్యా ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం? ఇలా ఎన్నో సందేహాలు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ. ఈ చర్చలో ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు.