Police Warned No Protest can be Held in Vijayawada: 'విజయవాడలో నిరసనలు చేపడితే.. క్రిమినల్ కేసులు'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2023, 3:58 PM IST
Police Warned No Protest can be Held in Vijayawada: విజయవాడ నగర పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి వీల్లేదని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసాద్, ఏసీపీ భాస్కరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెక్షన్ 144 , పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని గుర్తు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో అనధికార సందేశాలు వ్యాప్తి చెందుతున్నాయని.. లేనిపోని విషయాలను దుష్ప్రచారం చేయవద్దని పోలీసు అధికారులు కోరారు. అనుమతి లేని నిరసన కార్యక్రమాల్లో యువత పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా ముందస్తుగా అనుమతి తీసుకునే నిరసన చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేని నిరసనలో పాల్గొంటే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని నిరసన కార్యక్రమాల్లో యువత పాల్గొంటే భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు రావని.. విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్టులు ఇన్వబోమని చెప్పారు. ఇటీవల బెంజ్ సర్కిల్ వద్ద ఆందోళనలో పాల్గొన్న వారికి నోటీసులు ఇస్తున్నామని పోలీసు అధికారులు తెలుపారు.