Police Tried to House Arrest Dhulipalla Narendra Kumar: పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్న ధూళిపాళ్ల నరేంద్ర - Dhulipalla Narendra Kumar latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 6:08 PM IST
Police Tried to House Arrest Dhulipalla Narendra Kumar : నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లా పెదకాకాని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి ప్రధాన రహదారి వరకు నిరసన ర్యాలీ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హాజరవుతారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు.
ఈరోజు ఉదయం చింతలపూడి నుంచి నరేంద్ర కుమార్ బయటికి వస్తున్నగా పొన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే నారాకోడూరు చేబ్రోలు ప్రాంతాల్లో పరామర్శలు ఉన్నాయని అక్కడి నుంచి వచ్చారు. నారాకోడూరు యాదవపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక పండిట్లో పూజలు అనంతరం మధు అనే కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడ పొన్నూరు పట్టణ రూరల్ పోలీసులు చేరుకొని ఆయన్ని బలవంతంగా జీబు ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో నరేంద్ర కుమార్ నేలపై కూర్చుని తన నిరసనను వ్యక్తం చేశారు. కార్యకర్తల అడ్డుపడటంతో అక్కడ నుంచి పోలీసులు వెళ్లిపోయారు.
అనంతరం నారాకోడూరు కళ్యాణ మండపం వద్దకు నరేంద్ర చేరుకోగా అక్కడికి పోలీసులు వచ్చి మరోసారి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పెదకాకాని ర్యాలీకి అనుమతి ఉందా లేదా అని స్పష్టం చేయాలని పోలీసులను కోరారు. అనుమతులు లేకుంటే అనుమతి లేదని లిఖితపూర్వకంగా పత్రం అందజేస్తే వెళ్లిపోతానని పోలీసులకు వివరించారు. అప్పటి వరకు తమ విధివిధానాలను కొనసాగిస్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
TAGGED:
చంద్రబాబు అరెస్టు వార్తలు