Police thwart TDP activists convoy: చంద్రబాబు కోసం తరలివచ్చిన అభిమానులు.. అడ్డుకున్న పోలీసులు - చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 31, 2023, 7:25 PM IST
Police thwart TDP activists convoy: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై.. రాజమండ్రిలో సెంట్రల్ జైల్ నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు వెంట పార్టీ నేతలు, చంద్రబాబు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని చంద్రబాబుతో రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ... జైలు వద్ద బయలుదేరి 2 గంటలైనా చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి దాటలేదు. ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి వ్యవహరిస్తున్న నేపథ్యంలో కారు లోపల నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.
రాజమండ్రి దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు సాగుతున్న చంద్రబాబును చూసేందుకు తరలివచ్చిన అభిమానులను.. అడ్డుకుంటూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దివాన్ చెరువు వద్ద వ్యూహాత్మకంగా.. చంద్రబాబు కాన్వాయ్‌ని వదిలి ప్రైవేటు వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలు ఆగిపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. చంద్రబాబును అనుసరిస్తున్న పార్టీ నేతల వాహనాలు దివాన్ చెరువు వద్దే నిలిపోయాయి. భారీకేడ్లను అడ్డుపెట్టి వాహనాలను నిలువరించడంతో పోలీసులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికి వేరే మార్గాల ద్వారా చంద్రబాబు వెంటే నడుస్తున్నారు.