Police Seized 50 Lakh Worth Ganja in Alluri District: అల్లూరి జిల్లాలో రూ. 50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్ - Seized 50 Lakh Worth Ganja in Alluri District
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2023/640-480-19505857-thumbnail-16x9-police-seized-50-lakh-worth-ganja.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2023, 10:34 PM IST
Police Seized 50 Lakh Worth Ganja in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా డొంకరాయి మీదుగా తెలంగాణకు తరలిస్తున్న 50 లక్షల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డొంకరాయి ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో డొంకరాయి పోలీసు చెక్‌పోస్టు వద్ద మంగళవారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా హోండా కారులో గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నట్లు చెప్పారని పోలీసులు తెలిపారు. కారులో 50 లక్షల రూపాయల విలువ చేసే 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు నిందితులు తప్పించుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి కారు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని.. నిందితులను రంపచోడవరం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.