Police Revealed ప్రయాణికుల్లా ఎక్కి హత్య చేసి.. రూ.40 లక్షల ఐరన్ లోడ్​తో పరారీ! చివరికి చిక్కారిలా..! - Vizianagaram news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2023, 10:37 PM IST

Police solved Gotlam railway track dead body case: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం రైల్వేట్రాక్​పై ఈ నెల 13 వ తేదీన అనుమానస్పద స్థితిలో పడి ఉన్న మృత దేహానికి సంబంధించిన కేసుని బొడ్డపెల్లి పోలీసులు ఛేదించి హత్యకేసుగా నిర్ధారించారు. రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న లారీ డ్రైవర్ జగదీష్ యాదవ్ రాయగడ నుంచి విజయనగరం వైపు సుమారు 40 లక్షల విలువైన ఐరన్ లోడ్​తో వస్తున్నాడు. మార్గ మధ్యలో ప్రయాణికులమని లారీ ఎక్కిన ఐదుగురు వ్యక్తులు పథకం ప్రకారం జగదీష్ యాదవ్​ను లొబరుచుకుని మద్యం తాగించారు. అనంతరం లారీని గొట్ల మీదగా బొండపల్లి వరకు తీసుకెళ్లి అక్కడ హత్య చేసి జగదీష్​ను రైలు పట్టాలపై పడేసి నిందితులు ఐరన్ లోడ్ లారీతో పరారైయ్యారు.. కేవలం రైలు ప్రమాదంలో చనిపోయినట్లు నిర్ధారించే విధంగా చిత్రీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. లారీ కదలికకు సంబంధించి జీపీఎస్​ ట్రాకింగ్ చేసుకుంటూ.. ఆ లారీ ఎక్కడెక్కడ ఆగిందనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. గొట్లాం వద్ద 20 నిమిషాల పాటు ఆగి ఉండడాన్ని గమనించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. నిందితుల్లో హరీశ్వరరావుతో పాటు మరో అయిదుగురు వ్యక్తులు.. ఈ ఐరన్ లారీని దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు రూ.40 లక్షల విలువైన లారీని స్వాధీన చేసుకొని, హత్యకు సహకరించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చీపురుపల్లి డీఎస్పీ చక్రవర్తి వెల్లడించారు. ఐదుగురు నిందితులును అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించినట్టు తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.