Police Broke Up the Students Hunger Strike: విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్షపై అర్థరాత్రి పోలీసుల ఉక్కుపాదం.. ఉద్రిక్త వాతావరణం - చంద్రబాబు అరెస్టు వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 2:03 PM IST
Police Broke Up the Students Hunger Strike in Vijayawada : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అంటూ గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తెలుగుదేశం కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇద్దరు విద్యార్థులు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు. దర్షిత్, శ్రీనివాస్‌లు చేస్తున్న దీక్షను అర్ధరాత్రి దాటాక.. పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. దీక్షను భగ్నం చేసే సమయంలో పోలీసులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు తోసేశారు. "బాబు కోసం మేము సైతం" (IAM With Babu) అంటూ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులిద్దరినీ పోలీసులు ఎత్తుకెళ్లి జీపులో పడేసి.. అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.