Police Blood Donation Camp in Guntur : పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. భేష్​ అంటున్న జనం.. - పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 7:43 PM IST

Police Blood Donation Camp in Guntur : కేవలం శాంతి భద్రలే తమ లక్ష్యంగా కాకుండా ప్రాణదాయకమైన రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి సమాజానికి స్పూర్తి దాయకంగా నిలుస్తున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో పోలీసు పలు సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఆరో పోలీస్ బెటాలియన్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అదనపు డీజీ అతుల్ సింగ్, బెటాలియన్స్ డీఐజీ రాజకుమారి ప్రారంభించారు.

200 Policemens Donated Blood in One Day in AP : ఈ కార్యకరమంలో సుమారు 200 మంది పోలీసులు రక్త దానం చేశారు. రక్తదానం చేసిన పోలీసులకు ఏడీజీ అతుల్ సింగ్ గుర్తింపు పత్రాలను అందించారు. మెరుగైన సమాజం కోసం ప్రాణాలర్పించే పోలీసులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని  ఏడీజీ పేర్కొన్నారు. దీనిని ఒక రోజుకు పరిమితం చేయడం మంచిది కాదన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ముందుంటారని కొనియాడారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రత్యేక పోలీసులు పాత్ర మరువలేనిదని అతుల్ సింగ్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.