Police Arrest TDP Activities in Nellore: పోలీస్ స్టేషన్‌కు టీడీపీ కార్యకర్తలు.. సీఐతో కోటంరెడ్డి వాగ్వాదం - TDP workers doing vote verification
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2023, 9:29 PM IST
Police Arrest TDP Activities in Nellore : నెల్లూరు నగరం చిన్నబజార్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. 43వ డివిజన్‌లో ఓట్లు వెరిఫికేషన్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిన్నబజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ప్రశ్నించారు. తమ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని, ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని సీఐ అశోక్ కుమార్ను కోటంరెడ్డి నిలదీశారు. దీంతో సీఐ, కోటంరెడ్డి మధ్య (Argument Between CI Ashok Kumar and TDP Leaders in Nellore) తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతల ప్రశ్నలకు సీఐ సరైన సమాధానం చెప్పకుండా.. వారిపైనే దురుసుగా ప్రవర్తించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు, అధికార పార్టీ నేతలకు పోలీసులు దాసోహమంటున్నారని ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు.