Farmer arrest R5 జోన్లో రాళ్లు పాతుతుండగా అడ్డుకున్న రైతు.. అరెస్ట్ చేసిన పోలీసులు - జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
Police Arrest Farmer: తనపొలంలో ఇళ్ల స్థలాలకు రాళ్లు వేస్తుండుగా అడ్డుకున్న నిడ్రమరు రైతును మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. గైరుబోయిన నాగేశ్వరరావు అనే రైతు ఎకరా 57సెంట్లను రాజధానికి ఇవ్వగా... అధికారులు మూడు ప్లాట్లు కేటాయించారు. ఒక ప్లాట్ మట్టి క్వారీలో, మరో ప్లాట్ ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని భూమిలో వచ్చిందని రైతు వెల్లడించారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లమన్నారు. ఇంతలో తన ప్లాట్ స్థలంలో సెంటు భూమి హద్దు రాళ్లు వేస్తుంటే అడ్డుకున్నామన్నారు. పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనే తన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అంతోలోనే పూలింగ్‌కు ఇవ్వని భూమిలో, తనకు వచ్చిన ప్లాట్ స్థలంలో సెంటు భూమి హద్దు రాళ్లు పాతుతుండగా... అడ్డుకుంటే పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేశారని నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు డిమాండ్ చేశాడు.