వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలను అరికట్టడంలో పోలీసుల వైఫల్యం: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి - ap political news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-01-2024/640-480-20418281-thumbnail-16x9-ysrcp-leaders.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 3:00 PM IST
Police are Not Stopping YCP Anarchies in East Godavari : తూర్పుగోదావరి జిల్లా సుభద్రంపేటలో వైసీపీ అరాచకాలను పోలీసులు అరికట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ధ్వజమెత్తారు. సుభద్రం పేటలో నివాసం ఉంటున్న నాగమణి అనే వృద్ధురాలు, ఆమె కోడలిపై వైసీపీ జడ్పీటీసీ రాంబాబు దాడి చేసిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్య ప్రజలకు సేవ చేయాలసిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. వృద్ధురాలు, ఆమె కోడలిపై దాడి జరిగి వారం రోజులు అయినా కనీసం సంఘటన స్థలాన్ని పరిశీలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండ చూసుకుని రాంబాబు అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. జడ్పీటీసీ రాంబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తామన్నారు. ప్రైవేటు కేసులు వేసి న్యాయస్థానంలో తేల్చుకుంటామని పోలీసులను హెచ్చరించారు.