Polavaram Right Canal: ఇంకా విడుదల కాని నీళ్లు.. ఆందోళనలో రైతులు - నీటి కోసం రైతులు ఆందోళన
🎬 Watch Now: Feature Video
Water not Released to Polavaram Right Canal: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పోలవరం కుడి కాలువకు అధికారులు ఇంకా సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో పోలవరం కూడి కాలువ దాదాపు 80 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ కాలువ నీటినే నమ్ముకుని వేలాది ఎకరాలను రైతులు సాగు చేస్తుంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఆకుమడులు పోయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వరినాట్లు కూడా వేస్తున్నారు. జులై మాసం వచ్చినా తమకు ఇంకా సాగునీరు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. అసలు నీరు విడుదల చేస్తారో లేదో తెలియక రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇప్పటికే సాగునీరు విడుదల చేసిన అధికారులు.. ఈ ఏడాది నీరు విడుదల చేయలేదు. దీంతో ఏ పంటను వేయాలో కూడా తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. అధికారుల చూట్టూ తిరుగుతున్నా.. వారి నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని రైతులు చెబుతున్నారు. పోలవరం కూడి కాలువ సాగునీటి విడుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.