పీఎం జన్​మన్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో మోదీ వర్చువల్ సమావేశం - పీఎం జన్​మన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 3:39 PM IST

PM Modi Virtual Meeting with Chenchu Tribals: నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రధానమంత్రి వర్చువల్ పద్దతిలో చెంచులతో మాట్లాడేందుకు సమావేశం నిర్వహించారు. పీఎం జన్​మన్ (Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan) కార్యక్రమంలో భాగంగా చెంచులతో వర్చువల్ పద్దతి ద్వారా ప్రధానమంత్రి మాట్లాడారు. వారి జీవన స్థితిగతుల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. వర్చువల్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామన్‌, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. 

వీరితో పాటు నంద్యాల ఆర్డీవో శ్రీనివాసులు, ఐటీడీఏ పీఏ రవీంద్రారెడ్డి, బలపనూరు సర్పంచ్ మాధవి, పాణ్యం ఎంపీపీ హుస్సేన్, ఇతర అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి జనతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా చెంచులతో మాట్లాడిన ప్రధానమంత్రి, తమ సందేశాన్ని వీడియోలో వినిపించారు. ఇదే కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏలోని గిరిజనులతో కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీతంపేట నుంచి కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.