PIL in AP High Court for Fencing Tirumala Pathway: 'చేతి కర్రలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు..'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 4:33 PM IST
PIL in AP High Court for Fencing Tirumala Pathway: తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిలో అలిపిరి నుంచి తిరుమల వరకు ఇనుప గేట్లతో ఫెన్సింగ్ వేయాలని కోరుతూ టీటీడీ బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. నడక దారిలో వెళ్లే భక్తులకు భద్రత కల్పించటంలో అటవీశాఖ, టీటీడీ, ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ న్యాయవాది వై. బాలాజీ వాదనలు వినిపించారు. పులులు, ఎలుగుబంట్లను పట్టుకోవటంలో అధికారులు అలసత్వం చూపిస్తున్నారని అన్నారు. నడక దారిలో వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నడిచి వెళ్లే భక్తులకు వన్య మృగాల నుంచి రక్షించుకునేందుకు చేతి కర్రలను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని న్యాయవాది వాదనలు వినిపించారు. భక్తుల రక్షణ కోసం కంచె ఏర్పాటు చేసేందుకు టీటీడీ వద్ద నిధులు కూడా ఉంటాయన్నారు.
ఇటీవల పులి దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి 15 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేసి చేతులు దులుపుకున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. లక్షిత కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించాలని పిటిషనర్ తరుఫున న్యాయవాది డిమాండ్ చేశారు. పరిహారం అంశంపై కోర్టు సానుకులంగా స్పందించింది. పరిహారం పెంచే అంశంపై ప్రభుత్వం, ఫారెస్ట్, తితిదే అధికారులను మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.