Government Planning to Adventure Sports in Godavari And Krishna Water : రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదుల బ్యాక్ వాటర్, రిజర్వాయర్లు, చెరువులను సాహస జల క్రీడలకు వేదికగా మార్చేందుకు సిద్ధమవుతోంది. 34 జలవనరుల్లో దశలవారీగా బోటు షికారును అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణకు నడుం బిగించింది.
గిరిజనుల్లా ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నారా? - పెళ్లి కూడా చేసుకోవచ్చు!
దీనికోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టేలా ప్రణాళికలు రూపొందించింది. మొదట సోమశిలలోని కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ రెండు చోట్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కి రావడంతోపాటు నేడో, రేపో ప్రైవేటు సంస్థలతో ఒప్పందం జరగనున్నట్లు తెలిసింది. వాటిలో డిసెంబరు 4న స్పీడ్ బోట్లు, ఇతర సాహస జలక్రీడలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పర్యాటక అభివృద్ధి సంస్థ వర్గాల తెలుపుతున్నాయి.యి.
అయ్యప్ప కొండకు వెళ్దామా! - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా 62 రైళ్లు
రాష్ట్రం నలుమూలలా : జల పర్యాటకాన్ని పెద్ద ఎత్తున పెంచేందుకు వాటర్ స్పోర్ట్స్‌ని రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రవేశపెట్టేందుకు టూరిజం సంస్థ పదుల సంఖ్యలో జలవనరులను ఎంపిక చేసింది. తెలంగాణలోని సోమశిల, హుస్సేన్‌సాగర్‌తో పాటు రామప్ప చెరువు, లకారం, మధిర చెరువులు, కరీంనగర్ లోయర్‌మానేరు డ్యాం, నాగార్జునసాగర్‌లో కృష్ణా నదిలో(హౌస్‌బోట్), బుద్ధవనం వద్ద కృష్ణా నదిలో(హౌస్‌బోట్), గోదావరిఖని వద్ద గోదావరి నదిలో, మహబూబ్‌నగర్, సిద్దిపేట కోమటిచెరువు, భద్రకాళి చెరువు, కోటిపల్లి రిజర్వాయర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, కడెం రిజర్వాయర్ ఇలా వివిధ జలాశయాలు ఈ జాబితాలో ఉన్నాయి.
శ్రీశైలం సిగలో మరో ఐకానిక్ వంతెన - పర్యాటకుల మనసు దోచేలే ప్రయాణం
వాటిలో డీలక్స్, స్పీడ్, హౌస్ బోట్లతోపాటు పర్యాటకులకు పలు సౌకర్యాలూ కల్పించనున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు రిజర్వాయర్‌లో డీలక్స్ బోట్‌తోపాటు కాటేజీలు, కెఫెటేరియా, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాల్ని కల్పించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా మధిరలో జలక్రీడలతోపాటు కాటేజీలు, రెస్టారెంట్, పిల్లలు ఆడుకునే పరికరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. జమలాపురం చెరువు, స్థానిక దేవస్థానం వద్ద పర్యాటకులకు సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే కాటేజీలు, 20, 40 సీట్లతో బోట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.