YCP Attacks: 'మాకు చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కు ఎందుకెళ్లావ్'.. వైఎస్సార్సీపీ నాయకుల అరాచకం..! - Anarchy of YCP leaders
🎬 Watch Now: Feature Video
Person injured in attack by YSRCP leaders: వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రకాశం జిల్లా పామూరు మండలం పడమట కట్టకిందపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పామూరు మండలం పడమట కట్టకిందపల్లి గ్రామానికి చెందిన బాలకాశయ్య.. ఓ దుకాణం వద్ద టీ తాగుతుండగా.. వైస్ ఎంపీపీ, అతని అనుచరులు వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇటీవల బాలకాశయ్య ఓ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పామూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇది గ్రహించిన అధికార పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ.. సమస్య పరిష్కరించుకునేందుకు తమ వద్దకు రాకుండా స్టేషన్‌కు ఎందుకెళ్లావంటూ అనుచరులతో వచ్చి బాలకాశయ్యపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తాను స్థానికుల సహాయంతో వారి నుంచి తప్పించుకున్నానని బాధితుడు తెలిపాడు. కేవలం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాననే నెపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడు తెలిపాడు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరాడు.