People Suffering with Rice Worms: బాబోయ్ పురుగులు.. ఉండలేకపోతున్నాం.. కాస్త పట్టించుకోండి సారూ.. - బియ్యం పురుగులు
🎬 Watch Now: Feature Video
People Suffering with Rice Worms in Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో పురుగుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారతీయ ఆహార భద్రతా సంస్థ (ఎఫ్సీఐ) పట్టణంలోని ఓ గోదాములో బియ్యం నిల్వ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ఆశించే నల్లని రెక్కల పురుగులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. వీటి నివారణకు గోదాము అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అవి గోదాము చుట్టూ ఉన్న ఇళ్లల్లోకి చేరుతున్నాయి. అటుగా వెళ్లే పాదచారులకు, వాహన చోదకులకు వీటివల్ల ఇబ్బందులు తప్పడం లేదు. గోదాము చుట్టు పక్కన ఉన్న ఇళ్లలోకి పురుగులు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గృహాల్లో ఆహారపు ధాన్యాలు, పప్పు, ఉప్పు, దుస్తుల్లో.. ఈ పురుగులు చేరుతున్నాయని, వీటివల్ల రాత్రి వేళ సరిగా నిద్ర పోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి చెవుల్లో, కళ్లల్లో కూడా పురుగులు పడిపోతున్నాయని, వీటిపై తగిన చర్యలు చేపట్టాలని అధికారులు కోరినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.