Pawan Kalyan Varahi Tour : వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. సాయంత్రం అన్నవరం నుంచి వారాహియాత్ర - ఏపీ బ్రేకింగ్ న్యూస్ లైవ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18750805-420-18750805-1686731423040.jpg)
Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాబోయే ఎన్నికలకు సమయత్తమవుతున్నారు. ముందు నుంచి చెప్తునట్టుగానే ఆయన వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. వారాహి యాత్ర కోసం సర్వం సిద్ధమైంది. పవన్ ఈ యాత్ర ప్రారంభంతో ఎన్నికల ప్రచార శంఖారావం పూరించబోతున్నారు. ఈ రోజు ఉదయం అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని ఆయన దర్శించుకున్నారు. తర్వాత వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ రోజు అన్నవరం నుంచే యాత్రను మొదలుపెట్టనున్న పవన్.. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు వెళ్లనున్నారు. కత్తిపూడిలో జనసేన భారీ బహిరంగసభను నిర్వహించనుండగా.. జనసేనాని ఈ సభలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ.. కత్తిపూడి బహిరంగ సభ. పవన్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనటమే కాకుండా.. సినిమాల్లోనూ పాల్గొననున్నారు. అయితే పవన్ నటిస్తున్న సినిమాలను నిర్మిస్తున్న దాదాపు ఏపీలోనే షూటింగ్ నిర్వహించనున్నారు. దీనికి దర్శక, నిర్మాతలు కూడా అంగీకారించారు.