Pawan Kalyan Hot Comments On Jagan : జగన్ పులివెందుల రౌడీయిజం చేస్తే.. మేము చూస్తూ ఊరుకోం : పవన్ కల్యాణ్ - పులివెందుల రౌడీయిజం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 4:43 PM IST

Pawan Kalyan Hot Comments On YCP: మచిలీపట్నంలో జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో.. పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి పెడన సభపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రేపటి పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపారనే సమాచారం తమకు ఉందని అన్నారు. పబ్లిక్ మీటింగ్ లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారన్నారు. పెడన సభలో గొడవలు సృష్టిస్తే... తాము సహించమని పవన్‌ స్పష్టం చేశారు. సీఎం, డీజీపీ(DGP), ఇతర అధికారులు... జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని అన్నారు. టీడీపీ, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా.. ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత అని అన్నారు. జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

'ముఖ్యంగా జగన్(Jagan) కు చెబుతున్నాం...  మీరు పులివెందుల రౌడీయిజం చేస్తే.. మేము చూస్తూ ఊరుకోం' అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. దాడులు చేస్తే.. జనసేన సైనికులు ఎదురు దాడి దిగవద్దని సూచించారు. ఎవరు అనుమానంగా ఉన్నా.. జేబుల్లో నుంచి ఆయుధాలు తీసినా.. వారిని పట్టుకోవాలన్నారు. వాళ్లను పోలీసులకు మనమే తీసుకెళ్లి అప్పగించాలని అన్నారు. రెండు, మూడు వేల మంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మన సంఖ్యా బలం చాలా ఎక్కువ.. వారిపై దాడి చేయవద్దు... పట్టుకోవాలన్నారు. జగన్ ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. భవిష్యత్ లో చాలా దారుణంగా ఉంటుంది గుర్తు పెట్టుకోవాలంటూ పవన్‌ హెచ్చరించారు. 

దివ్యాంగుల సమస్యలపై స్పందించిన పవన్: ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు పవన్‌కు వారి సమస్యలు వినిపించారు. వారి సమస్యలపై స్పందించిన పవన్... దివ్యాంగుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందన్నారు. దివ్యాంగులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పవన్‌ (Pawan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఇద్దరు దివ్యాంగులు ఉంటే ఒకరికే పింఛను ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానసిక దృక్పథం లేదని విమర్శించారు. దివ్యాంగులకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సైన్ భాషా విధానం అన్ని కార్యాలయాల్లో ఉండేలా చూస్తామని... బడ్జెట్‌లో దివ్యాంగులకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని పవన్ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.