ETV Bharat / state

సరదాల సంక్రాంతి - అలరిస్తున్న రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు - EARLY SANKRANTI CELEBRATIONS IN AP

సంప్రదాయాలు ఉట్టిపడేలా మొదలైన ముందస్తు సంక్రాంతి సంబరాలు - మహిళలకు వివిధ రకాల పోటీల నిర్వహణ - విజేతలకు బహుమతులు అందజేత

Early Sankranti Celebrations 2025 Start in AP
Early Sankranti Celebrations 2025 Start in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Early Sankranti Celebrations 2025 Start in AP : రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థినులు సందడి చేస్తున్నారు. రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొస్తున్నారు. పలుచోట్ల మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయ ప్రాంగణాన్ని ఉద్యోగులు రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. సచివాలయంలోని వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు ముగ్గులు వేశారు. ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించుకునే ఉద్యోగులు ఈసారి కూడా అదే ఉత్సాహంతో రంగురంగుల ముగ్గులు వేసి పోటీల్లో పాల్గోన్నారు. వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు వేసిన ముగ్గులను ఉత్తమమైనవి ఎంపిక చేసి బహుమతులు అందించనున్నట్టు ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల సంఘం తెలియజేసింది. మరోవైపు వివిధ రంగవల్లులతో ఏపీ సచివాలయం వర్ణశోభితమైంది. గంగిరెద్దులు కూడా విచ్చేసి పండుగ శోభను ముందే సచివాలయానికి తెచ్చాయి.

ముందుగానే సంక్రాంతి శోభ - హరిదాసుల కీర్తనలు - రంగురంగుల ముగ్గులు

విశేషంగా ఆకట్టుకున్న ప్రదర్శనలు : కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి జడ్పీ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. గుంటూరు జిల్లా నంబూరులోని VVIT ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సాంప్రదాయ వస్త్రధారణతో వివా పాఠశాల విద్యార్థులు అలరించారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు, గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఒంగోలు SNS కళాశాలలో జిల్లా స్థాయి ఈనాడు ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. పోటీల్లో పాల్గొన్న విద్యార్థునులు తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయాలను గౌరవిస్తూ, అందమైన ముగ్గులు పేసి వాటిని రంగులతో అలంకరించారు. విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఈనాడు సంక్రాంతి సంబరాల పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రకాల ఆకృతులతో విద్యార్థినులు అందమైన ముగ్గులు వేశారు. న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులను మెప్పించి విద్యార్థినులు బహుమతులు గెలుచుకున్నారు.

కనుమ అంటేనే కోనసీమ - ప్రభల తీర్థంపై ప్రధాని మోదీ లేఖ

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కాకతీయ CBSC పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా గ్రామాల్లో సంక్రాంతి పండుగను నిర్వహించుకునే విధంగా పిల్లలు ఈ వేడుకలను నిర్వహించారు. పల్లె వాతావరణంలో సంక్రాంతి పండుగ వేడుకను కళ్లకు కట్టినట్లు చూపించారు. విద్యార్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూరి గుడిసెల్లో నివాసం, గంగిరెద్దుల విన్యాసం, పిండి వంటలు, బొమ్మల కొలువులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య హాజరయ్యారు.

రంగురంగుల ముగ్గులు - హరిదాసుల కీర్తనలు - మొదలైన సంక్రాంతి సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.