సంక్రాంతి ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు- సొంతూళ్లకు వెళ్లేందుకు అవస్థలు - andhra pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 9:25 AM IST
Passengers Problems on sankranti Festival Season: సంక్రాంతి సంబరాల కోసం సొంతూళ్లకు చేరుకుంటున్న వారితో రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిగామ వద్ద సుమారు కిలోమీటర్ మేర జాతీయ రహదారి అధ్వానంగా ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న వాహనాలు గుంతల్లో ముందుకు వెళ్లలేక మెల్లగా వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో నందిగామ వై జంక్షన్ వద్ద 2 కిలోమీటర్లపైన వాహనాలు బారులు తీరుతున్నాయి.
ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే వాహనాలతో రహదారి కిక్కిరిపోయింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సంక్రాంతి పండుగ రద్దీ పెరిగింది. సమీప ప్రాంతాల సర్వీసుల్ని రద్దుచేశారు. హైదరాబాద్ నుంచి అవస్థలుపడి విజయవాడ చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, ఒంగోలు, గుంటూరులకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.