Paritala Sunitha Fire on Ministers: నందమూరి, నారావారి కుటుంబాల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టం: పరిటాల సునీత - Paritala Sunitha comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 7:55 PM IST
Paritala Sunitha Fire on Ministers: వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందమూరి, నారావారి కుటుంబాల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టమన్నారు. 'కొడాలి నాని నీకు రోజులు దగ్గరపడ్డాయి.. ఇక కాస్కో' అంటూ హెచ్చరించారు. ఏ తప్పూ చేయని తమ పార్టీ నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. అసౌకర్యాల నడుమ, మానసిక క్షోభకు గురి చేస్తూ జైల్లో నిర్బంధించారని ఆమె ఆవేదనకు గురయ్యారు.
Karagara Gruha Bandha Vimochana Yagam: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలంటూ.. మడకశిర మండలం కల్లుమరి గ్రామంలోని శ్రీ వీరకేతమ్మ ఆలయంలో 'కారాగార గృహ బంధ వియోచన యాగం' నిర్వహించారు. ఈ యాగానికి మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్యఅతిథిగా పాల్గొని.. గుడి ముందు 101 టెంకాయలు పగలగొట్టారు. అనంతరం 'మేము సైతం బాబు కోసం' బల్లపై సంతకం చేశారు.
Paritala Sunitha Comments: పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ..''ఏ తప్పు చేయని మా నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అసౌకర్యాల నడుమ, మానసిక క్షోభకు గురి చేస్తూ జైల్లో నిర్బంధించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఆయన సతీమణి భువనేశ్వరి గారు.. తన భర్త పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె పట్ల హేళనగా మాట్లాడుతున్నారు. కొడాలి నాని మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. నందమూరి, నారావారి కుటుంబాల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టం. కాస్కోండి మీ రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు అరెస్టుతో నేడు మహిళలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఫ్యాక్షన్‌ను వ్యతిరేకించిన నాయకుడు చంద్రబాబు.'' అని ఆమె అన్నారు.