సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన వైసీపీ ప్రభుత్వం - ఈ నెల 11నుంచి సదస్సులు - పంచాయతీ రాజ్ ఛాంబర్స్ మీటింగ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 5:32 PM IST
Panchayat Raj Chambers State President Rajendra Prasad: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మార్చారని పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. రాష్ట్రంలోని 9 వేలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలు, సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వంపై రెండో దశ ఉద్యమాన్ని చేపట్టారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్స్ తరపున రాష్ట్రంలో జోన్లవారిగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 11న శ్రీకాకుళం, 12న కాకినాడ, 13న నరసరావుపేట, 14న కడపలో సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నాలుగుచోట్ల నిర్వహించే పంచాయతీరాజ్ సదస్సులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, సర్పంచులు సదస్సులను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిందని పంచాయతీ రాజ్ ఛాంబర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునిరెడ్డి ఆరోపించారు.