Model Wins Several Beauty Pageants Including Miss Global Asia : సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఆ యువతే నిదర్శనం. మోడలింగ్‌పై మక్కువతో ర్యాంప్ వాక్, టాకింగ్ స్కిల్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన అందాల పోటీల్లో మిస్ ఫ్యాషన్ ఐకాన్ కిరీటాన్ని గెలుచుకుంది. ముంబయిలో జరిగిన పోటీల్లో వివిధ రాష్ట్రాల మోడల్స్‌ను వెనక్కి నెట్టి మిస్ ఇండియా ఐకానిక్ దివాగా నిలిచింది. మలేసియాలో జరిగిన పోటీల్లో పాల్గొని మిస్ గ్లోబల్ ఏషియా కిరీటం సాధించింది. చదువుతో పాటు మోడలింగ్ రంగంలో రాణిస్తున్న యువతి భావన రెడ్డి తన గురించి మరిన్ని వివరాలు ఈ చిట్‌చాట్ ద్వారా తెలుకుందాం.
'నా ఫస్ట్ విన్నింగ్ మిస్ బెస్ట్ ఫ్యాషన్ ఐకాన్ 2022లో జరిగింది. తరువాత మిస్ ఇండియా ఐకాన్ దివా, అక్కడికి అన్ని రాష్ట్రాలవారు వచ్చారు. అక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, భాష అన్నింటిని తెలియజేసేలా పోటీల్లో పాల్గొన్నాను. చివరకు ఆ పోటీల్లో ఏపీ విజేతగా నిలిచింది. ఆ పోటీల్లో గెలిచిన తరువాత నాకు ఎంతో ఆత్మస్థైర్యం పెరిగింది. మిత్ర ఫౌండేషన్ స్థాపించాను. సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలని సంకల్పించుకున్నాను. ఈ ఎన్జీవో ద్వారా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. నాదృష్టిలో క్రౌన్ (కిరీటం) ఆభరణం మాత్రమే కాదు. అది ఒక బాధ్యత. ఆ స్ఫూర్తితో మలేసియాలో జరిగిన పోటీల్లో పాల్గొని మిస్ గ్లోబల్ ఏషియాగా నిలిచాను.' -భావన రెడ్డి మిస్ గ్లోబల్ ఏషియా.
గోదావరి తీరంలో పుట్టి - న్యూయార్క్ అందాల వనితగా ఎంపిక
అమ్మాయిలు అనుకున్నది సాధించడానికి పట్టుదల, శ్రమ విడవద్దు అని అభిప్రాయపడుతున్నారు భావన. తల్లిందండ్రులు తమ పిల్లల అభిరుచులను తెలుసుకుని వారికి అండగా నిలబడితే యువత తాము అనుకున్నది సాధించగలరని మిస్ గ్లోబల్ ఏషియా భావన అంటున్నారు. దీంతో పాటు మనం చెయ్యాలనుకునే దాని కోసం ప్రణాళికాబద్దంగా ప్రాక్టీస్ చెయ్యడం తప్పనిసరి అంటున్నారు. మిత్ర ఫౌండేషన్ ద్వారా సమాజానికి తన వంతు కృషి చేస్తానంటున్నారు ఈ యువ విజేత భావన రెడ్డి.
పాడటమే కాదు వీణ వాయిద్యంలోనూ ప్రావీణ్యం - ఔరా అనిపిస్తున్న యువతి