Opposition Leaders Fire On CM Jagan : సీఎం పర్యటనను నిరసిస్తూ డోన్‌లో సీపీఐ నేతల ర్యాలీ.. ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటాం: బీజేపీ - andhra pradesh politics news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 10:18 AM IST

Opposition Leaders Fire On CM Jagan : ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఏం చేశారని.. సీఎం జగన్ వస్తున్నారని.. విపక్ష నేతలు ప్రశ్నించారు. హామీలు నెరవేర్చకుండా ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. ముఖ్యమంత్రి పర్యటనను నిరసిస్తూ.. డోన్‌లో సీపీఐ నేతలు ర్యాలీ చేపట్టారు. డోన్ , ప్యాపిలి, బేతంచెర్ల మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం వద్ద ఎండిపోయిన వేరుశనగ పంటతో పెద్ద ఎత్తున్న ధర్నాకు దిగారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పగిలిన పైపులను ప్రారంభించేందుకా ముఖ్యమంత్రి వస్తున్నారని కర్నూలులో సీపీఎం నేతలు ఎద్దేవా చేశారు. డోన్‌లో ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని బీజేపీ నాయకులు తెలిపారు. జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేసినప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చాలా విషాదకరం అని సీపీఎం నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలని అన్నారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. హామీలు నెరవేర్చకుండానే మరోసారి ఓట్లు అడగడానికి వస్తున్నారు. దీనికి బీజేపీ నిరసన తెలుపుతుంది అన్నారు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు అలాంటి ఏమి చేయలేదని బీజేపీ నాయకులు విమర్శించారు . 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.