సోదరుల మధ్య సెల్ఫోన్ వివాదం - తమ్ముడిని అతికిరాతకంగా చంపిన అన్న - murder for phone in anantapur district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 3:23 PM IST
Older Brother Killed His Younger Brother : సెల్ఫోన్ విషయంలో గొడవ పడి తమ్ముడిని అన్న అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. మృతుడు వివరాల్లోకి వెళ్లితే జిల్లాలోని శెట్టూరు మండలం కనకూరు గ్రామంలో రవికుమార్, కృష్ణమూర్తి అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. వీరి ఇరువురు తరచూ గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. ఆ క్రమంలోనే బుధవారం ( నవంబర్ 6న ) సెల్ఫోన్ విషయంలో పరస్పరం కొట్టుకున్నారని స్థానికులు తెలిపారు.
Younger Brother was Killed : బుధవారం జరిగిన సంఘటనకు ఆగ్రహించిన రవికుమార్ గురువారం రాత్రి ( నవంబర్ 7న ) కృష్ణమూర్తి నిద్రిస్తుండగా గొడ్డలితో నరికినట్లు పోలీసులకు తెలిపారు. తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు రవికుమార్ పోలీస్ స్టేషన్ లొంగిపోయినట్లు పేర్కొన్నారు. గ్రామంలో దారుణంగా జరిగిన హత్య వార్త విన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు.