Old Woman Fires on Anantababu Followers: రెచ్చిపోయిన అనంతబాబు అనుచరులు.. జామాయిల్ తోట నరికేశారని గిరిజన వృద్ధురాలి ఆవేదన - alluri anathabbau latest news
🎬 Watch Now: Feature Video
Old Woman Fires on MLC Anantababu Followers in Alluri District : అల్లూరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు జామాయిల్ తోటలను నరికి వేయించారని ఓ గిరిజన వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డతీగల మండలం ఎల్లవరంలోని కొసూరి కళ్యాణం, ఆమె కుమారుడు సత్తిబాబు 14 సంవత్సరాల నుంచి రేయింబవళ్లు కష్టపడి జామయిల్ చెట్లను పెంచుతున్నామన్నారు. ఇప్పుడు అనంత బాబు అనుచరులు వచ్చి చెట్లను దౌర్జన్యంగా నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుంచి ఎల్లవరం గ్రామంలో తమ కుటుంబ సభ్యులకు రెండు ఎకరాల తొమ్మిది సెంట్లు భూమి ఉందని, దానిలో జామాయిల్ తోటలను వేసుకున్నామన్నారు. ప్రస్తుతం అవి కాపుకు వచ్చాయి. అనంతబాబు అనుచరులు కృష్ణారెడ్డి, తమదాల రాజబాబు అన్యాయంగా తమ తోటలను నరికివేయించారని,.. అలానే భూమిని కూడా కబ్జా చేస్తున్నారని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లను, ఆటోలను తీసుకొచ్చి బలవంతంగా చెట్లు నరుకుతున్నారని తెలిపారు. దీనిపై ఇటీవల అడ్డతీగల పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు. అనంతబాబు అనుచరులని భయపడి అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.