స్పీడ్‌గా వచ్చి.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఆయిల్ ట్యాంకర్ - NAD flyover bridge in Visakhapatnam
🎬 Watch Now: Feature Video
Oil Tanker Stuck Under NAD Flyover: విశాఖపట్నంలోని ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే ట్రాఫిక్‌ను మళ్లించడానికి గతంలో ఓ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఇంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. తాజాగా ఆ ఫ్లైఓవర్ దగ్గర ఓ పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని ఎన్ఏడీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఆయిల్ ట్యాంకర్ ఇరుక్కుపోయింది. శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులు ఆయిల్ ట్యాంకర్‌ని పక్కకి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఫ్లైఓవర్ కింద ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వేరువేరు మార్గాల్లో వాహనాలను.. పోలీసులు పంపిస్తున్నారు. ప్రతి వాహనాన్ని ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే విధంగా ట్రాఫిక్ మళ్లింపు చేశారు.