NTR Centenary Celebrations : అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు - NTR birth anniversary celebrations in Washington
🎬 Watch Now: Feature Video
NTR Centenary Celebrations in Boston:సామాజిక ఉద్యమ నిర్మాత నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు కొనియాడారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతిని వెలిగించి.. తర్వాత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. రాజకీయ, సినీరంగంపైనే కాదు,యావత్ తెలుగు నేలపై ఎన్టీఆర్ పేరు చెరగని సంతకమన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్‌ను కట్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంపై.. ఎన్టీఆర్ వేషధారణ పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు.
మరోవైపు వాషింగ్టన్ డీసీలో సైతం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. దీనికి తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. జ్యోతిని వెలిగించిన తర్వాత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. మహిళలు పసుపుపచ్చ చీరలతో ర్యాలీగా తరలివచ్చి హారతులు ఇచ్చారు.
TAGGED:
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు