NRIs Rally in America on CBN Arrest: 'మచ్చలేని చంద్రుడు'.. బాబుకు మద్దతుగా లాస్ ఏంజిల్స్‌లో ఎన్నారైల కొవ్వొత్తుల ర్యాలీ - ntr dist latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-10-2023/640-480-19662153-thumbnail-16x9-nris-rally-in-america-on-cbn-arrests.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 5:12 PM IST
NRIs Rally in America on CBN Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ దేశ, విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆయనకు మద్దతుగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు సంఘీభావంగా లాస్ ఏంజిల్స్‌లో నివసించే తెలుగువారు.. 'వీ స్టాండ్ విత్ సీబీఎన్', 'గొప్ప కలలు కనడం నేర్పాడు.. మేము కన్న కలలు నెరవేర్చాడు' అని రాసి ఉన్న ప్లకార్లు పట్టుకుని.. ఆ ప్రాంతమంతా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నల్ల మాస్కులు ధరించి వారి బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 'వీ స్టాండ్ విత్ సీబీఎన్' అంటూ నినాదాలు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మచ్చలేని చంద్రుడిలా త్వరలోనే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటికి వస్తారని ర్యాలీ చేసిన ప్రవాస భారతీయులు ఆకాంక్షించారు.