NRIs Protest For CBN in America : 'బాబుతో మేము సైతం'.. అమెరికాలో నిరసన కొనసాగిస్తున్న తెలుగు ప్రజలు - చంద్రబాబు కోసం తాజా నిరసనలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 2:25 PM IST
NRIs Protest For CBN in America : రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినేతకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. దేశవిదేశాల్లోను ఉన్న ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. తాజా అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రంలో టాంపా నగరంలో ఉంటున్నా.. తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. 'బాబుతో నేను' అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆందోళనలు చేశారు.
ఈ నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు, టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. ప్లకార్డులు చేతపట్టి ఆందోళనలో పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన తప్పు ఏంటి అంటూ ప్లకార్డులతో నిరనలు చేశారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా.. అంటూ ప్రశ్నించారు. తప్పుడు కేసులపై గళమెత్తుదాం.. జగన్ కుట్రను ఎండగడదాం.., సైకో పోవాలి.. సైకిల్ రావాలి.., 'బాబుతో నేను' అని చాటి చెపుదాం అంటూ నినాదాలు చేస్తూ టాంపా నగరంలో ర్యాలీలు చేశారు. వెంటనే చంద్రబాబును విడదల చేయాలని డిమాండ్ చేశారు.