NRI Agitations in Poland Against Chandrababu Arrest: పోలండ్, ఫ్రాన్స్​లో చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఐటీ ఉద్యోగుల ఆందోళనలు - పోలండ్లో ప్రవాసాంధ్రులు ఆందోళనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 10:32 PM IST

Updated : Sep 26, 2023, 10:49 PM IST

NRI Agitations in Poland Against Chandrababu Arrest : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలండ్, ఫ్రాన్సు దేశాల్లోను ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. 

IT Employees to Support Chandrababu Naidu in Poland :  రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేశారని, అందుకే ఆయనకు మద్దతుగా "I am With CBN" అంటూ ఆందోళన కార్యక్రమం చేపట్టామని ప్రవాసాంధ్రులు పేర్కోన్నారు. చంద్రబాబు ఐటీ సెక్టార్‌ను అభివృద్ది చేయడం వల్లే తాము విదేశాల వరకు వచ్చి మంచి ఉద్యోగాలు చేసుకునే స్థాయికి ఎదిగామని, ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. తమ భవితకు దారి చూపిన దార్శనికుడు చంద్రబాబు అని ఆయనకు అండగా నిలవడం తమ బాధ్యత అని వారు తెలిపారు.

Last Updated : Sep 26, 2023, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.