MLA Nimmala Protest With Flood Victims ఆ రూ.2 వేలు ఎక్కడా..? వరదబాధితుల కలసి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఆందోళన! - లంక గ్రామల ప్రజలకు పరిహారం ఇవ్వలిన్న నిమ్మల
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-08-2023/640-480-19250808-thumbnail-16x9-nimmala-ramanaidu-protest-with-flood-victims.jpg)
Nimmala Ramanaidu Protest With Flood Victims: వరద బాధితులకు ప్రభుత్వం అందించే 2000 రూపాయల పరిహారం.. ఇంకా అందలేదంటూ.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసనకు దిగారు. వరద బాధితుల ఆకలి కేకలు పేరుతో.. యలమంచిలి మండలంలోని కనకాయలంక, పెదలంక గ్రామాల ప్రజలతో కలిసి.. ఖాళీ కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. వరదల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదంటూ.. ఎవరూ ఫిర్యాదు చేయకూడదని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రికి యలమంచిలి మండలంలోని లంక గ్రామాల్లో నివసించే ప్రజల ఆకలి కేకలు వినిపించడం లేదా అని సీఎం జగన్ను ఆయన ప్రశ్నించారు. వరద బాధితులకు ప్రకటించిన రూ. 2 వేల పరిహారం ఇంకా అందలేదని చెప్పడానికి మీరు మా ఊరు వస్తారా.. లేక మమ్మల్నే రమ్మంటారా అంటూ సీఎం జగన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 15 రోజులపాటు పనులు లేక పస్తులతో ఉంటే వరద సాయం అందించే మానవత్వం లేదా అంటూ సీఎం జగన్ను నిమ్మల ప్రశ్నించారు.