Navaratri Celebrations at Indrakiladri ఇంద్రకీలాద్రిపై నేడు లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు.. ఫోటెత్తిన భక్తులు - నవరాత్రి అమ్మవారి అలంకారాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 4:55 PM IST
Navaratri Celebrations at Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శారదా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన నేడు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా అమ్మవారు భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో, వాత్సల్య రూపిణిగా చెరకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చొని లలితా త్రిపురసుందరీదేవిగా అమ్మవారు కొలువుదీరారు. ఈ రూపాన్ని తిలకించి తరించేందుకు భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.
7th Day Dassehra Festival at Vijayawada 2023 : లలితాదేవి అలంకరణ రోజున లలితా సహస్రనామంతో అమ్మవారికి విశేష కుంకుమార్చనలను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మూలానక్షత్రం సందర్భంగా రెండు లక్షల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. టిక్కెట్ దర్శనాలను రద్దు చేసిన అధికారులు యథావిధిగా వాటిని పునరుద్ధరించారు. న్యాయమూర్తులు, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో 500 రూపాయల టిక్కెట్టు దర్శనాలకు కొంత ఎక్కువ సమయం పడుతోందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.