Environment: ప్రకృతి కోసం యువకుడి 21 రాష్ట్రాల్లో పాదయాత్ర.. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ.. - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Nature Lover Ashutosh Pandey interview: పర్యావరణ పరిరక్షణే ఆ యువకుడి ప్రధాన ధ్యేయం. అందుకు ఏకంగా అతడు చేస్తున్న ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి.. ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పించాడు. 'వందే భారత్' పేరుతో అయోధ్యలో యాత్ర ప్రారంభించాడు. ఈ క్రమంలో దేశంలోని 21 రాష్ట్రాల్లో 10 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టాడు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న ఆ యువకుడు.. ఇటీవలే ఆంధ్రప్రేదశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాడు. ఈ వినూత్న పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఆ యువకుడి పేరు.. ఆశుతోష్ పాండే. అతడు ఉత్తర ప్రదేశ్కు చెందినవాడు. కాగా.. ఆ యువకుడికి ఈ పాద యాత్ర చేయాలని ఎందుకు అనిపించింది..? ఈ యాత్రలో భాగంగా అతడు ఏఏ కార్యక్రమాలు చేస్తున్నాడు..? యువతరానికి స్ఫూర్తి కల్గించేందుకు అతడు ప్రధానంగా ఎంచుకున్న మార్గం ఏంటి..? వంటి మరిన్ని వివరాలను ఆ ప్రకృతి ప్రేమికుడినే అడిగి తెలుసుకుందాం రండి..