Nara Lokesh Tweet On Anganwadi Milk Packets Issue: రక్తం రుచి మరిగిన మృగానికి.. జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదు: లోకేశ్ - lokesh latest comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 1:37 PM IST
Nara Lokesh Tweet On Anganwadi Milk Packets Issue : పసి పిల్లలకిచ్చే పాలను కూడా సీఎం జగన్ వదలట్లేదంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతి దాహం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపపు సొమ్ము కోసం పసి పిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీ చేస్తూ.. కాలకూట విషంగా మార్చారని నారా లోకేశ్ ఆరోపించారు.
అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటి వరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ఈ నెల 3వ తేదీన ప్యాక్ చేసినట్లుగా చెప్పబడుతున్న పాల ప్యాకెట్లకు డిసెంబర్ 2వ తేదీ వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నా.. సరఫరా చేసిన రెండు రోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయని విమర్శించారు. ఇవి చూశాక రక్తం రుచి మరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోందంటూ దుయ్యబట్టారు. ఉబ్బిపోయిన పాల పాకెట్లకు సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ తన ట్వీట్‌కు జత చేశారు.