Nara Lokesh Fired On YSRCP: చంద్రబాబును నిర్బంధించామని వైసీపీ సైకోల ఆనందం.. ప్రజల నుంచి దూరం చేయలేరన్నదే నిజం : నారా లోకేశ్ - కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో ఏపీవాసులు మృతి
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 4:30 PM IST
Nara Lokesh Fired On YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి.. తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టామని వైసీపీ సైకోలు భావిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కానీ, చంద్రబాబును ఈ నిర్బంధాలు ప్రజల నుంచి దూరం చేయలేవని తన తల్లి భువనేశ్వరి చెప్తోందని లోకేశ్ వివరించారు. చివరకు నిజం గెలిచే తీరుంతుందని.. చంద్రబాబు మరింత ప్రభావంతంగా ప్రజల కోసం-రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తారని భువనేశ్వరి మాటల్లో స్పష్టం అవుతోందని అన్నారు.
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై స్పందించిన లోకేశ్: ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన కూలీల రోడ్డు ప్రమాదంపై లోకేశ్ స్పందించారు. వలస కూలీలు మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం తీవ్రంగా కలచివేసిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలే కావడం బాధకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అయితే గోరంట్ల నుంచి కర్ణాటకకు 15మంది వలస కూలీలు ఓ కారులో బయల్దేరగా.. అది కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ సమీపానికి రాగానే ఆగి ఉన్న ట్యాంకర్‌ను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12మంది ప్రాణాలు కోల్పోగా.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.