Nara Lokesh: జగన్ రుషికొండకు గుండు కొడితే.. ఉండవల్లి కొండను ఆళ్ల మింగేశాడు: లోకేశ్ - ఆళ్ల రామకృష్ణారెడ్డి
🎬 Watch Now: Feature Video
Nara Lokesh on Alla Ramakrishna Reddy : మంగళగిరి నియోజకవర్గంలో సహజ వనరులను అధికార వైఎస్సార్సీపీ నేతలు కొల్లగొడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక తరలింపు, మట్టి మాఫియాతో పాటు తాజాాగా కొండలను సైతం పిండి చేసి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని దందా కొనసాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యాన నియోజకవర్గంలో ఉండవల్లి కొండను తవ్వుతున్న దృశ్యాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. సహజ వనరుల దోపిడీలో జగన్ రెడ్డిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని లోకేశ్ ఆరోపించారు. జగన్ రుషికొండకు గుండు కొడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండను మింగేశారని విమర్శించారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఆళ్ల మైనింగ్ మాఫియా యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉండవల్లి కొండను మాయం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి.. కొండపై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని లోకేశ్ అభినందించారు.