Lokesh on Jagan: వాళ్లని విచారిస్తేనే వివేకా హత్య కేసులో అసలు విషయం బయటకు వస్తోంది: లోకేశ్​ - Nara Lokesh Comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2023, 1:31 PM IST

Nara Lokesh Comments on CM Jagan: మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. హత్య అర్ధరాత్రి జరిగితే తెల్లవారుజామున లోటస్ పాండ్​లో జగన్​ మీటింగ్​ పెట్టారన్నారు. ఆ మీటింగ్​లో ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులకు గుండెపోటుతో బాబాయ్ చనిపోయాడు అని జగన్​ చెప్పాడని ఆరోపించారు. అంటే అప్పటికే వివేకా మృతదేహానికి కుట్లు వేసి కట్టుకట్టే కార్యక్రమం పూర్తి చేశారని విమర్శించారు. ఆ మీటింగ్​లో ఉన్న నలుగురిని విచారిస్తే నిజమైన మాస్టర్ మైండ్ దొరికిపోవడం ఖాయమని లోకేశ్​ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నారా లోకేశ్‌ 88వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభం అయ్యింది. వెంకటగిరి, అనుగొండ మీదుగా పాణ్యం నియోజకవర్గంలోకి లోకేశ్​ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.