Nara Lokesh at Gannavaram Airport: దిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న లోకేశ్.. రేపు చంద్రబాబుతో ములాఖత్ - లోకేశ్ దిల్లీ పర్యటన వివరాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 10:44 PM IST
|Updated : Oct 6, 2023, 9:15 AM IST
Nara Lokesh at Gannavaram Airport: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిల్లీ నుంచి అమరావతి చేరుకున్నారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. తెలుగుదేశం శ్రేణుల్ని జాతీయ రహదారి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు వాహనాలు రోడ్డు మీద వదిలి కాలినడకన విమానాశ్రయం వద్దకు వెళ్లారు. అనంతరం లోకేశ్ కు స్వాగతం పలికారు. అభిమానుల తాకిడితో విమానాశ్రయం టెర్మినల్ కిక్కిరిసిపోయింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.
శుక్రవారం ఉదయం రాజమండ్రి బయలుదేరి వెళ్లనున్నారు. లోకేశ్ శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. గత నెల 14వ తేదీన రాజమండ్రి నుంచి దిల్లీకి వెళ్లిన లోకేశ్ దిల్లీలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రపతిని కలవటంతో పాటు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. న్యాయవాదులతో నిరంతర సంప్రదింపులు, జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేశ్.. 21 రోజుల తర్వాత దిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చారు.