విశాఖలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా - andhra pradesh news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 3:37 PM IST
|Updated : Jan 5, 2024, 7:10 PM IST
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన 33వ డివిజన్ వెంకటేశ్వరమెట్టకు చెందిన తెలుగుదేశం కార్యకర్త జాగరపు చిన్నా కుటుంబాన్ని పరామర్శించారు. 41వ డివిజన్ జ్ఞానాపురంలో మృతి చెందిన మలిశెట్టి రమణ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం 45వ డివిజన్ తాడిచెట్లపాలెంకు భువనేశ్వరి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. భువనేశ్వరి వెంట వెళ్లిన గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత ఉన్నారు. ప్రతి కుటుంబానికి పార్టీ తరఫున ఆర్థికసాయం అందించారు. అనంతరం గాజువాకలో 66వ డివిజన్ అజిమాబాద్‌లో కోరుకొండ మంగ, 65వ డివిజన్ భానోజితోటలో సరోజిని, షీలానగర్‌లో కృష్ణమూర్తి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు.
కాగా నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కును అందిస్తున్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి, గురువారం శ్రీకాకుళం జిల్లాలో యాత్ర కొనసాగింది. నేడు విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటిస్తున్నారు.