Nara Bhuvaneshwari Left Rajahmundry: రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన నారా భువనేశ్వరి - Chandrababu wife Nara Bhuvaneshwari news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 10:26 PM IST

Updated : Sep 29, 2023, 10:33 PM IST

Nara Bhuvaneshwari Left Rajahmundry : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి నేడు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన ఆమె.. క్యాంపు కార్యాలయంలో తన కోడలు బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ, మరికొందరు ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం భువనేశ్వరి టీడీపీ శిబిరం నుంచి బయలుదేరి..హైదరాబాద్‌కు పయనమయ్యారు. 

Nara Bhuvaneshwari Wll be Coming to RJY on October 2: నారా భువనేశ్వరి.. రెండు రోజుల పాటు (శనివారం, ఆదివారం) హైదరాబాదులో ఉండి సోమవారం రోజున తిరిగి రాజమహేంద్రవరం రానున్నారని.. పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన రోజు నుంచి ఆమె రాజమహేంద్రవరంలోనే ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో భేటీలు అవుతూ.. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ..పలుచోట్ల నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని.. మహిళలు, పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆమె హైదరాబాద్‌లో ఉండి..వచ్చే నెల 2వ తేదీన రాజమహేంద్రవరానికి రానున్నారని.. పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Sep 29, 2023, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.