Ward Councilor: "పనుల కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటా.. రాజీనామా చేయమంటే చేస్తా" - today live news telugu

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 29, 2023, 10:06 PM IST

Updated : Apr 29, 2023, 10:15 PM IST

Nandhyala Ward Councilor: తన వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగటం లేదని.. నంద్యాలలోని అధికార పార్టీ వార్డు కౌన్సిలర్​ ఆవేదన వ్యక్తం చేశారు. తన వార్డు అభివృద్ధికి నోచుకోలేదని.. అభివృద్ధి కోసం రాజీనామా చేయమంటే చేస్తానని అన్నారు. అభివృద్ధి జరగాలంటే ఎవరి కాళ్లు పట్టుకోవాలో చెేప్తే వారి కాళ్లైనా సరే పట్టుకుంటానని ఆందోళన వ్యక్తం చేశారు. 

నంద్యాల పురపాలక సంఘం కౌన్సిల్​ సమావేశం శనివారం నిర్వహించగా.. అధికార పార్టీకి చెందిన 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్​ సమావేశంలో​ తన గోడు తెలిపాడు. కౌన్సిల్​ ఏర్పాటై రెండు సవంత్సరాలు పూర్తి కావస్తోందని.. అయినా తన వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కౌన్సిల్​ సమావేశంలో ఛైర్​ పర్సన్​ను ప్రశ్నించారు. అభివృద్ధి లేకపోవటం దురదృష్టకరమని వాపోయారు. వార్డులో ఎలాంటి అభివృద్ధి లేదని.. ప్రజలు తనని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో కూడా కౌన్సిల్​కు ఎన్నికయ్యానని.. ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని తెలిపారు. ఈ విధంగా ఉంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలమని ఆవేదన వ్యక్తం చేశారు.  

Last Updated : Apr 29, 2023, 10:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.