Nakka Anand Babu Revealed JP institute Sand Mining Subcontract Issue: జేపీ సంస్థ సబ్​ కాంట్రాక్టు నిబంధనను బహిర్గతం చేసిన నక్కా ఆనంద్​బాబు - Nakka Anand Babu Fire on minister Peddireddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 5:18 PM IST

Nakka Anand Babu Revealed JP institute Sand Mining Subcontract Issue: జేపీ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో.. సబ్​ కాంట్రాక్టు ఇవ్వకూడదనే నిబంధన ఉందని.. దానిని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు బహిర్గతం చేశారు. వైసీపీ నాయకులకు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదని చెప్పటానికి ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు. దానికి ఇసుక పాలనే నిదర్శనమని విమర్శించారు. పెద్దిరెడ్డి మంత్రి పదవికి అనర్హుడని ఆరోపించారు. 

పెద్దిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని.. గవర్నర్​ వెంటనే ఆయనను బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే గవర్నర్​ను కలిసి సబ్​ కాంట్రాక్టు వివరాలను బట్టబయలు చేస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ విషయంలో పెద్దిరెడ్డి నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి, ఒక సంస్థకు లబ్ది చేకురేలా పెద్దిరెడ్డి వ్యవహరించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి కార్యకర్తల వరకు వైసీపీ నాయకులందరూ ఇసుకను యథేచ్చగా దోచేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక మాఫియా భరతం పడతామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.