Nakka Anand Babu complaints to ZP CEO on Votes Deletion: ఓటర్ల జాబితా అవకతవకలపై జెడ్పీ సీఈవోకు నక్కా ఆనంద్‌బాబు ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
Nakka Anand Babu complaints to ZP CEO on Votes Deletion: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కారణంగా తమ ఓటు ఉందో లేదోనని ప్రతిరోజూ.. ప్రజలు తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అవకతవకలపై గుంటూరు జిల్లా పరిషత్ సీఈవోను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున వేమూరు ఎంపీడీవో కార్యాలయంలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించటాన్ని తప్పుబట్టారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని సమావేశంలో చెప్పటంపై మండిపడ్డారు. అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వేమూరు నియోజకవర్గానికి జెడ్పీ సీఈవో రిటర్నింగ్ అధికారిగా ఉన్నందున ఆయన్ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవటం దొంగే.. దొంగా అన్నట్టుందని నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు.
TAGGED:
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు