సమ్మె బాటలో మున్సిపల్ కార్మికులు - జగనన్నా రాష్ట్రమంతా ధర్నాచౌక్ అవుతుంది చూడన్నా! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 6:52 PM IST
Municipal Workers Strike Bike Rally In Satya sai District : సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఈ నెల 26వ తేదీ (మంగళవారం) నుంచి సమ్మె బాట పట్టనున్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా సీఎం జగన్ హామీలు నెరవేర్చలేదని మున్సిపల్ కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
Municipal Workers Strike Against YSRCP Govt : ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్టీసీ ఉద్యోగులు సహా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. వారి బాటలోనే మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళుతున్నట్లు కార్మిక సంఘ నాయకులు, సీఐటీయూ సభ్యులు స్పష్టం చేశారు. సమ్మెకు మద్దతు తెలిపాలని కోరుతూ ద్విచక్ర వాహన ప్రదర్శనను చేపట్టినట్లు కార్మికుసంఘ నాయకులు తెలిపారు.