నెల్లూరులో సమస్యలపై గళమెత్తిన పారిశుద్ధ్య కార్మికులు - పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 7:16 PM IST

Municipal Outsourcing Employees Protest: ప్రజల కోసం పని చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని పారిశుద్ధ్య  కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్  ఎన్నికల మ్యానిఫెస్టోలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్​సోర్సింగ్ కార్మికులను అధికారంలోకి వచ్చాక పర్మినెంట్ చేస్తామన్నారు. అధికారం చేపట్టిన తరువాత కార్మికులకు ఇచ్చిన వాగ్దానం మరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Municipal Workers Protest at Corporation Office in Nellore District: నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్​లో జరుగుతున్న సమావేశంలోకి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నం చేశారు. గేటు దూకెేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ముందు కార్మికులు బైఠాయించారు. వారికి మేయర్ స్రవంతి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.  

ఇటీవల జరిగిన పత్రికా విలేకర్ల సమావేశంలో పాల్గొన్న నెల్లూరు పాలకవర్గ సభ్యులు.. జిల్లాకు రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని, నెల్లూరు నగరపాలక సంస్థ 1వ ర్యాంకు సాధించిందని తెలిపారన్నారు.  మున్సిపల్ కార్మికులు శ్రమను జగన్ సర్కారు  గుర్తించడం లేదని కార్మికులు తెలిపారు. ఈరోజు కార్పొరేషన్​లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని తీర్మానించి ప్రభుత్వానికి పంపించాలన్నారు. జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చేలా చేసేంత వరకూ పోరాటాన్ని ఆపబోమని పారిశుద్ధ్య కార్మికులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.