Municipal Officers Raid On Weekly Market Shops: విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం.. దుకాణాలపై దాడులు, జరిమానా - నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-10-2023/640-480-19854048-thumbnail-16x9-municipal-officers-raid-on-weekly-market-shops.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 5:26 PM IST
Municipal Officers Raid On Weekly Market Shops: రాష్ట్రంలో గత కొంత కాలంగా ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది. అయితే, నిషేధం ఉన్నా చిరు వ్యాపారులు, రోజువారీ సరుకుల కోసం వచ్చే వారికి ప్లాస్టిక్ కవర్లలో ఆయా వస్తువులను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు, వ్యాపారస్థులకు అవగాహన కల్పిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ శానిటరీ విభాగం అధికారులు విస్తృత ప్రచారం చేశారు. తాజాగా మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి బుధవారం ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు.
రాయదుర్గం పట్టణంలోని చికెన్ మార్కెట్ లో 9 చికెన్, మటన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న వారికి జరిమానా విధించారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 150 మైక్రాన్ల మందం కలిగిన గల ప్లాస్టిక్ కవర్లు మాత్రమే వాడాలన్నారు. ఇష్టారీతిన ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధం పై మున్సిపల్ అధికారులు రాయదుర్గం పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాపారులు ప్రజలు ప్లాస్టిక్ నిషేధించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.