MP Raghu Ramakrishna Raju lashed out at the YCP: సీఎం జగన్ నాయకత్వంలోనే... మార్గదర్శిపై దాడులు: రఘురామకృష్ణరాజు - వైసీపీ పై ఆరోపణలు చేసిన రఘురామకృష్ణరాజు
🎬 Watch Now: Feature Video
MP Raghu Ramakrishna Raju lashed out at the YCP: మార్గదర్శిపై వైసీపీ సర్కారు వేధింపులకు కోర్టు బ్రేక్ వేసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వం చేసే మోసాలను ఈనాడులో ఎండగడుతున్నారనే రామోజీరావుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేధింపులు ఇలానే కొనసాగితే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని అన్నారు. మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని చందాదారులను అధికారులు బతిమాలుకుంటున్నారని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. మార్గదర్శి వ్యవహారంలో ఐపీఎస్ అధికారులూ అసలు కనీస నిబంధనలు పాటించటం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఇలాంటి తప్పులు చేస్తున్నందుకు అధికారులు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావు సంస్థలపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కేవలం సీఎం జగన్ నాయకత్వంలోనే మార్గదర్శిపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చందదారులను ప్రలోభపెట్టి కేసులు పెట్టేందుకు.. వారిని సైతం బతిమిలాడే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఇప్పటికే 'వీ ఆర్ విత్ యూ రామోజీరావు' అంటూ.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతుందని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. కక్షపూరితంగా దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.